నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీ స్థాపించండి.. ఎమ్మెల్సీ కవిత

by Javid Pasha |
నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీ స్థాపించండి.. ఎమ్మెల్సీ కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించాలని హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాద్ లో ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రసిడెంట్ కృష్ణ మోహన్ వీరవల్లితో భేటీ అయ్యారు. నిజామాబాద్ ఐటీ హబ్ పై సుదీర్ఘంగా చర్చించారు. అక్కడి రవాణా, నీరు, విద్యత్తు వంటి సౌకర్యాలతో పాటు శాంతి భద్రత గురించి కంపెనీ ప్రతినిధులకు కవిత వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. యువతకు స్థానికంగానే ఉద్యోగావకాలు కల్పించాలనే ఉద్ధేశ్యంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అన్ని జిల్లాల్లో ఐటీ హబ్ లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి అమలు చేస్తున్నారని తెలిపారు.

ఐటీ హబ్ లో ఏర్పాటు చేయబోయే కంపెనీలకు అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భవిష్యత్తులో నిజామాబాద్ లో మరిన్ని కంపెనీలు ఏర్పాటు అవుతాయని పేర్కొన్నారు. స్థానిక యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ విజ్ఞప్తికి కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రవాణా సౌకర్యం విషయంలో ఆర్టీసీ బస్సులను ఐటీ హబ్ వరకు వేయించడానికి కృషి చేస్తాననిస్పష్టం చేశారు. నేడు(మంగళవారం) కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్ ను సందర్శించనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే షకీల్, బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ గ్లోబల్‌ కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల గుప్తా పాల్గొన్నారు.


Advertisement

Next Story

Most Viewed