MLC Jeevan Reddy: కాళేశ్వరంలో లక్ష కోట్లు దోపిడీ

by Gantepaka Srikanth |
MLC Jeevan Reddy: కాళేశ్వరంలో లక్ష కోట్లు దోపిడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల దోపిడీ జరిగిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ప్రాజెక్టు, కుంగిపోవడం దారుణమన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిలువకు అవకాశం లేదన్నారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిందని, వారి సూచనలకు అనుగుణంగా ఈ మూడు బ్యారేజీలను వినియోగంలోకి తీసుకురావాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. శనివారం ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ.. అభివృద్ధి పేరిట బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందన్నారు.

పదేళ్లు అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తంగా మార్చేసిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం అప్పు వాటా రూ.75 వేల కోట్లుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అది దాదాపు రూ.7.6 లక్షల కోట్లకు చేరిందని అన్నారు. దీంతోనే ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారన్నారు. గడిచిన 7 నెలలుగా ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. 7 నెలల్లో ఎన్నో హామీలు నెరవేర్చామన్నారు. భవిష్యత్‌లో మేనిఫెస్టో అంతా పూర్తి చేశామన్నారు. ప్రజాపాలనలో పేదోడీకి పెద్దపీట వేశామన్నారు. రైతు రుణమాఫీతో లక్షల మందికి మేలు జరుగుతుందన్నారు. గ్రామాల్లో 80 శాతం మంది ప్రజలు ఉచిత విద్యుత్ లబ్ధి పొందుతున్నారన్నారు.

Advertisement

Next Story