- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ములుగు MLA సీతక్కకు ఓయూ డాక్టరేట్

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. రాజనీతి శాస్త్రంలో ఆమె పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సీతక్కే సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ''నా చిన్నతనంలో నేనెప్పుడూ నక్సలైట్ అవుతానని అనుకోలేదు. నక్సలైట్‌గా ఉన్నప్పుడు లాయర్‌ని అవుతానని, లాయర్‌గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవుతానని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పీహెచ్‌డీ చేస్తానని అనుకోలేదు. ఇప్పుడు మీరు నన్ను డాక్టర్ సీతక్క అని పిలవచ్చు'' అని తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గొత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతులపై రాజనీతి శాస్త్రంలో ఆమె పరిశోధన పూర్తి చేశారు. సీతక్క పూర్తి పూర్తి చేసిన గంథ్రాన్ని పరిశీలించిన ఓయూ అధికారులు ఆమెకు పీహెచ్‌డీ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆమె హర్షం వ్యక్తం చేశారు.
Next Story