- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ భారత్‌లో ఉందా? పాకిస్థాన్‌లో ఉందా?: రాజాసింగ్
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై నమోదవుతున్న కేసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తనకు వచ్చిన బెయిల్‌ను రద్దు చేయించేందుకే అనవసర కేసులు బనాయిస్తున్నారంటూ రాజాసింగ్ ఆరోపించారు. తెలంగాణలో ధర్మంవైపు మాట్లాడినా, గోవధను వ్యతిరేకించినా, లవ్ జీహాద్‌పై మాట్లాడినా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అసలు తెలంగాణ భారత్‌లో ఉందా? పాకిస్తాన్‌లో ఉందా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, శ్రీరామనవమిరోజే నన్ను చంపాలకున్నామని, రంజాన్ తర్వాత తప్పక చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. తనకు ఏదైనా టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి కాల్స్ వస్తున్నాయా లేక ఓల్డ్ సిటీలోని కొందరు నెట్ నుంచి ఇలా కాల్స్ చేస్తున్నారా అని తేలాల్సి ఉందన్నారు. కాగా, శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని.. ఓ వర్గాన్ని కించపరిచేలా నినాదాలు చేశారని రాజాసింగ్‌పై కేసు నమోదైంది.