- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రూ.500 నోటుపై రాముడి ఫొటో ముద్రించాల్సిందే.. ఇది అందరి డిమాండ్’
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిరం ప్రారంభం వేళ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ప్రజలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా రూ.500 కరెన్సీ నోటు వ్యవహారం. ఈ నోటు రాముడి బొమ్మ ముద్రించి ఉన్న ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ వైరల్ వార్తలను గమనించిన బీజేపీ నేతలు ఒక సరికొత్త డిమాండ్‌ను తెరమీదకు తీసుకొస్తున్నారు. భారత కరెన్సీ నోట్లపైనా రాముడి బొమ్మ ముద్రించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా.. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. రూ.500 నోటుపై రాముడి చిత్రాన్ని ముద్రించాలని డిమాండ్ చేశారు. ఇది తన ఒక్కడి డిమాండ్ కాదని.. 100 కోట్ల మంది హిందువుల అభిప్రాయమని చెప్పారు. అమెరికా, థాయ్‌లాండ్, ఇండోనేషియా వంటి దేశాల కరెన్సీ నోట్లపై హిందూ దేవతల ఫొటోలు ముద్రించుకున్నారని గుర్తుచేశారు. ఇండియాలో 80 శాతానికి పైగా హిందువులు ఉన్న మన దేశంలో కరెన్సీ నోట్లపై రాముడి బొమ్మ ఎందుకు ముద్రించకూడదని అన్నారు.