MLA Raja Singh: కొత్త ఆస్పత్రిపై రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక రిక్వెస్ట్

by Ramesh N |
MLA Raja Singh: కొత్త ఆస్పత్రిపై రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక రిక్వెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియం ఆవరణలో (Osmania Hospital) ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రికి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శంకుస్థాపన సైతం చేశారు. అయితే ఈ ప్రాంతంలో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించడాన్ని స్థానికులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఇవాళ కీలక రిక్వెస్ట్ చేశారు. (Goshamahal) గోషామహల్‌లో హాస్పిటల్ కడితే ఇబ్బంది వస్తుందని ప్రజలు భయాందోళనలో ఉన్నారని వెల్లడించారు. కరోనా లాంటి వ్యాదులకు ట్రీట్‌మెంట్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతుంది కాబట్టి, స్థానికులకు వైరస్ అంటే ప్రమాదం ఉందని ప్రజలు అయోమయంలో ఉన్నట్లు చెప్పారు.

గోషామహల్ గ్రౌండ్‌లో కొత్త ఉస్మానియా హాస్పిటల్ కట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలో మాట్లాడిన మాటలు గుర్తుకు చేశారు. పాత హాస్పిటల్ వద్ద కొత్త నిర్మాణానికి తగిన స్థలం ఉందని అన్ని విధాలుగా చెప్పినట్లు తెలిపారు. గ్రౌండ్ చుట్టూతా నివాసముంటున్న ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. వారి గోడును సీఎం రేవంత్ రెడ్డి వినిపించుకోవాలని కోరారు. తాను ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో ఉన్న కారణంగా తను రాలేకపోయినట్లు తెలిపారు. స్థానికులతో ఒకసారి సీఎం మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. జనవరి 3 లోపల తను హైదరాబాద్ రాబోతున్నట్లు చెప్పుకొచ్చారు.

Next Story