వైరల్ వీడియాలపై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి క్లారిటీ

by Satheesh |   ( Updated:2023-07-15 08:51:10.0  )
వైరల్ వీడియాలపై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ భద్రత సిబ్బందితో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర వివాదస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చారు. శనివారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. మూములుగా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఉన్న తమ స్నేహితులు స్నాప్ చాట్‌లో ఆ వీడియో తీశారని.. ప్రభుత్వ భద్రత సిబ్బందిని వీడియోల కోసం వాడుకునే రకం కాదని అన్నారు.

నరేంద్రమోదీ లాగా కావాలని వీడియో తీసుకోలేదని సెటైర్ వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఔట్ డేటెడ్ వ్యక్తి అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, హోమంలో జరిగిన అగ్ని ప్రమాదంపై పైలెట్ రియాక్ట్ అయ్యారు. హోమం అయ్యాక పై నుంచి ఒక అదృశ్య స్పార్క్ వచ్చి మంటలు అంటుకున్నాయని.. మంటలు అంటుకున్నప్పుడు వేదపండితులు యాగశాలలోనే ఉన్నారని తెలిపారు. హోమం అంతా పూర్తి అయ్యాక మంటలు రావడం శుభపరిణామం అని అన్నారు.

Advertisement

Next Story