- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈడీ ముందు హాజరైన MLA పైలట్ రోహిత్ రెడ్డి..
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తిరస్కరించడంతో మధ్యాహ్నం 3.00 గంటల తర్వాత జోనల్ కార్యాలయంలో హాజరయ్యారు. అయ్యప్ప దీక్షలో ఉన్నందున ఈ నెల 31వ తేదీ వరకు ఎంక్వయిరీకి హాజరుకావాల్సిన అవసరం లేకుండా గడువు కావాలని కోరినప్పటికీ ఆఫీసర్ల నుంచి పర్మిషన్ రాలేదని, అందువల్లనే మరో గత్యంతరం లేక వచ్చినట్లు మీడియాకు వివరించారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని క్లారిటీ ఇచ్చారు. నిర్దిష్టంగా ఏ కేసుకు సంబంధించిన విషయంలో తనను ఈడీ విచారణకు పిలిచిందో తెలియదని, లోపలకు వెళ్ళిన తర్వాత మాత్రమే వివరాలు అందుతాయని తెలిపారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లతో విచారణకు హాజరవుతున్నట్లు తెలిపారు.
ఈ నెల 15న ఈడీ జారీచేసిన నోటీసుల్లో వ్యాపార సంస్థలు, కంపెనీలు, వాటిలో పెట్టుబడులు, భాగస్వామ్యం, ఆదాయపు పన్ను రిటన్ వివరాలు, బ్యాంకు ఖాతాల డీటెయిల్స్, కుటుంబ సభ్యుల డిపాజిట్లు, లోన్లు తదితరాలన్నింటికి సంబంధించిన డాక్యుమెంట్లు తేవాల్సిందిగా ఈడీ అదనపు డైరెక్టర్ దేవేంద్రసింగ్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తక్కువ సమయం ఇవ్వడం, వరుసగా సెలవులు ఉన్నందున బ్యాంకు ఖాతాలకు సంబంధించిన స్టేట్‌మెంట్‌ను తీసుకోడానికి వీలుపడలేదంటూ న్యాయవాది సూచన మేరకు వ్యక్తిగత సహాయకుడు శ్రావణ్ ద్వారా ఈడీకి రిక్వెస్టు పంపినా ఆమోదం రాకపోవడంతో విచారణకు హాజరయ్యారు.
ఈడీ నుంచి నోటీసులు అందిన మరుసటిరోజే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి రోహిత్ రెడ్డి చర్చించారు. విచారణకు హాజరయ్యే కొన్ని గంటల ముందు కూడా సోమవారం చర్చించారు. ఈడీ అధికారుల విచారణలో రోహిత్ రెడ్డి ఎలాంటి జవాబు ఇస్తారు, ఏ కేసుకు సంబంధించిన అంశంలో ఎంక్వయిరీ జరుగుతున్నదీ మరికొన్ని గంటల్లో తెలియనున్నది.
ఇవి కూడా చదవండి :
Delhi Liquor Scam Case: స్పెషల్ కోర్టులో నిందితులకు చుక్కెదురు
- Tags
- Rohit Reddy
- trs