- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈడీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హాజరు..
దిశ, డైనమిక్ బ్యూరో: పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇవాళ ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఎదుట విచారణకు హజరయ్యారు. మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలు పాల్పడ్డారంటూ ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల క్రితం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తో పాటు సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలో ఈడి సోదాలు చేసింది. ఈ సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యాపార లావాదేవీలు, అకౌంట్స్, మనీ ట్రాన్సాక్షన్స్‌పై అధికారులు ఆరా తీశారు.
సంగారెడ్డి పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో మహిపాల్ సోదరులు మైనింగ్ నిర్వహించినట్లు సమాచారం. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మహిపాల్ రెడ్డి వ్యాపారం చేశారని తెలుస్తోంది. మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి టాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టాలని ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ లో వచ్చిన లాభాలన్నీ రియల్ ఎస్టేట్‌తో పాటు బినామీ పేర్లతో వ్యాపారాలు కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు రూ. 300 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా చేశారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు రూ. 39 కోట్ల రూపాయల వరకు టాక్స్ ఎగ్గొట్టారని ఆరోపణలు ఉన్నాయి.