MLA Koushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు? ఆధారాల సేకరణలో పోలీసులు

by Shiva |   ( Updated:2024-09-05 04:00:28.0  )
MLA Koushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు? ఆధారాల సేకరణలో పోలీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అందుకోసం పూర్తి ఆధారాలను సేకరిస్తు్న్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 3న మున్నేరు వరద బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖమ్మం పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కేడర్ మధ్య గొడవ తలెత్తింది. ఆ గుంపులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్‌రెడ్డి కిందపడగా, ఆయన కాలు మీదుగా కారు వెళ్లడంతో కాలు ఫ్యాక్చర్ అయినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఆ సమయంలో కారును ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి డ్రైవ్ చేశాడనని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఆధారాలు లభించగానే ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటు, మాజీ మంత్రి హరీశ్ రావుకు చెందిన కారును సైతం సీజ్ చేసే చాన్స్ ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed