Komatireddy: అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం మునుగోడు

by Gantepaka Srikanth |
Komatireddy: అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం మునుగోడు
X

దిశ, వెబ్‌డెస్క్: నీటిపారుదల శాఖ(irrigation department) అధికారులతో హైదరాబాదులోని తన నివాసంలో కాంగ్రెస్ కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గం(Munugode Constituency)లో చిన్న నీటి వనరులను పటిష్ట పరచడానికి సమగ్రమైన కార్యాచరణ రూపొందించి పనులను మొదలుపెట్టాలని ఆదేశించారు. అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం మునుగోడు అని.. ఇక్కడ పడే ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టాలని అన్నారు.

భూగర్భ జలాలు పెరిగితే.. వ్యవసాయం మెరుగుపడే అవకాశం ఉందని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న 669 చెరువులకు పూర్వవైభవం తీసుకురావాలని అన్నారు. పూడిక తీయడం, కట్టలను పటిష్టం చేయడం లాంటి పనులను విడతల వారీగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. భూగర్భ జలాలను పెంచడానికి చెరువులతోపాటు వాగులపై ఎన్ని చోట్ల మత్తడి(మట్టితో నిర్మించే మినీ చెక్ డ్యాం) నిర్మాణాలు చేపట్టాలి, వాగులపై ఎన్ని చోట్ల చెక్ డ్యాములు నిర్మించాలి అనే వివరాలు తెలుసుకోవాలని అన్నారు.

Advertisement

Next Story