Raj Gopal Reddy: ఆ పొరపాట్లు ఇంకా వెంటాడుతున్నాయ్.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
Raj Gopal Reddy: ఆ పొరపాట్లు ఇంకా వెంటాడుతున్నాయ్.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయని కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక(Munugode by-election)ల్లో ఎలాగైనా ఓట్లను రాబట్టుకోవాలని ఆలోచనతో నాటి బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేసిందని గుర్తుచేశారు. అందులో భాగంగానే గొల్ల, కురుమల వ్యక్తిగత బ్యాంక్ ఎకౌంట్లలో డబ్బులు జమ చేసిందని తెలిపారు. ఆ సమయంలో కొంతమంది బ్యాంక్ అకౌంట్లను ఫ్రిజ్ చేశారని అన్నారు.

అప్పటినుండి ఇప్పటివరకు ఫ్రిజ్ చేసిన అకౌంట్‌లను రిలీజ్ చేయకపోవడంతో యాదవులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రకటించిన రుణమాఫీ డబ్బులు, పత్తి కొనుగోలు డబ్బులు, ధాన్యం కొనుగోలు డబ్బులన్నీ ఆ అకౌంట్లలోనే పడటంతో తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని ఇవాళ రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో నల్గొండ జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్‌లను రిలీజ్ చేయాలని కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు రాజ్ గోపాల్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed