- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
MLA Kamalakar: ఒక్క నిమిషంలో సభ వాయిదా వేయడం ఏంటి.. ఎమ్మెల్యే గంగుల ఆగ్రహం

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నిలకల్లో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అమలు, కులగణన (Cast Census)పై ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీ ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడింది. సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) ప్రకటించారు. ఈ క్రమంలోనే సభను ఒక్క నిమిషంలో వాయిదా వేయడం పట్ల కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (MLA Gangula Kamalakar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సభ ఒక్క నిమిషం వాయిదా పడిన ఘటన అసెంబ్లీ (Assembly) చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదని అన్నారు. అసలు బీసీ (BC)లు, ఎస్సీ (SC)లపై కాంగ్రెస్ సర్కార్ (Congress Government)కు చిత్తశుద్ధి ఉందా.. అని ప్రశ్నించారు. ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగేటప్పుడు ముందే కేబినెట్ సమావేశం (Cabinet Meeting) నిర్వహించవచ్చు కదా అన్ని అన్నారు. గత 60 ఏళ్లలో తెలంగాణ (Telangana) రాష్ట్ర వెనుకబాటుకు ఇదే కాంగ్రెస్ పార్టీ (Congress Party) అని కామెంట్ చేశారు. ముఖ్యమైన అంశాలపై చర్చ ఉందని తాము అసెంబ్లీ (Assembly)కి వచ్చామని.. తీరా హాజరయ్యాక తమను అవమానించేలా సభను వాయిదా వేయడం కరెక్ట్ కాదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.