- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్..

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. మంగళవారం జగ్గారెడ్డి ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆయన ఖాతా నుండి రకరకాల పోస్టులు పెడుతున్నారు. తన ఫేస్ బుక్ పేజీలో సంబంధం లేని పోస్ట్‌లను చూసిన జగ్గారెడ్డి అకౌంట్ హ్యాక్ అయ్యిందని గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని వెంటనే జగ్గారెడ్డి అభిమానులను అలర్ట్ చేశారు.
తన ఫేస్ బుక్ అకౌంట్ నుండి వచ్చే పోస్ట్‌లను చూసి ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా, గతంలో కూడా ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. అప్పుడు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ టీమ్ ఆయన అకౌంట్‌ను పునరుద్దరించగా.. తాజాగా మరోసారి జగ్గారెడ్డి ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ కావడం గమనార్హం.