- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ రాహుల్ గాంధీ పాదయాత్రతో యూజ్ లేదు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: శంషాబాద్, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, లింగంపల్లి, సంగారెడ్డి మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర ఉండేలా చూడాలని పీసీసీని కోరుతానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. ఓఆర్ఆర్ మీదుగా జరిగే పాదయాత్రతో యూజ్ లేదని, దీనిపై టీపీసీసీతో చర్చిస్తానని తెలిపారు. సోమవారం ఆయన అసెంబ్లీ సీఎల్పీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంగారెడ్డి నియోజకవర్గంలో 30 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొన్నారు. నా నియోజకవర్గంలో పాదయాత్ర ఉందని సోషల్ మీడియా ద్వారా తెలిసిందని వెల్లడించారు. యాత్ర సంగారెడ్డిలో ఎంటరై ముగింపు వరకు ప్రధానంగా ప్రజలను ఇన్వాల్వ్ చేస్తామని స్పష్టం చేశారు. అన్ని కులాలు, మతాల ప్రజలను భాగస్వామ్యం చేస్తామని వివరించారు. రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకునేలా ప్లాన్ చేస్తామని చెప్పారు. లోకల్ పార్టీ నేతలతో చర్చించి నియోజకవర్గంలో యాత్ర సక్సస్‌కు వర్కవుట్ చేస్తామని తెలిపారు. ఈరోజు గాంధీ భవన్‌లో జరిగే సమావేశంలో నా నియోజకవర్గానికి సంబంధించిన పాదయాత్రపై క్లారిటీ తీసుకుంటానన్నారు.
బీజేపీ దిగజారుడు రాజకీయాలు
బీజేపీ నేతలు రాహుల్ గాంధీని ఏమని విమర్శించాలో అర్థంకాక టీ-షర్ట్‌లను విమర్శిస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. పెట్రోల్, డీజిల్ ధరలు, ప్రభుత్వ సంస్థల అమ్మకాల గురించి రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. బీజేపీ టీ షర్ట్‌లపై రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ పూటకో డ్రెస్ మారుస్తారని, మూడు పూటలకు 60 లక్షల ఖరీదు చేసే డ్రెస్‌లు వేసే మోడీ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడదని ప్రశ్నించారు. మోడీ ధరించే రూ.60లక్షల డ్రెస్ ఎక్కడ, రాహుల్ గాంధీ ధరించే రూ.40వేల టీ షర్ట్ ఎక్కుడ.. బీజేపీ నేతలు దీనికి సమాధానం చెప్తారా.. అని నిలదీశారు.