రాహుల్​ గాంధీ సభ ఖర్చంతా నాదే: MLA Jagga Reddy కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-04-27 13:25:47.0  )
MLA Jagga Reddy To hold Public Meeting in Sangareddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీలో జగ్గారెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. వరుస అసంతృప్తి ప్రకటనలతో పార్టీని డైలమాలో నెట్టివేస్తున్నారు. గంటల వ్యవధిలోనే పార్టీని విమర్శిస్తూ ప్రకటనలు చేయడం గమనార్హం. గాంధీభవన్‌లో ప్రశాంతత లేదు. ఫ్రెండ్లీ పాలిటిక్స్​కరవైనాయి. అని బుధవారం ప్రకటించిన జగ్గారెడ్డి.. మళ్లీ కొత్తగా సంచనల వ్యాఖ్యలు చేశారు. 2017లో సంగారెడ్డిలో నిర్వహించిన రాహుల్ సభకు ఖర్చు అంతా తనదేనని స్పష్టం చేశారు. అంత చేసినా.. పార్టీలో గుర్తింపు లేదన్నారు.

ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రంలో ముగించుకొని తెలంగాణ రాష్ట్రంలో మొదటి రోజు మహబూబ్ నగర్ జిల్లాలో అడుగు పెట్టడం జరిగిందని, ఆ తర్వాత సంగారెడ్డిలో 25 కిలోమీటర్లు ముగించుకొని మహారాష్ట్ర రాష్ట్రానికి వెళ్ళడం జరిగిందన్నారు. ఈ యాత్ర ఖర్చు కూడా తనదేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు. సభ సక్సెస్‌పై స్వయంగా రాహుల్​అభినందించినా.. ఇప్పుడున్న ఇన్​ఛార్జ్‌లు తెలుసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. పార్టీలో గత పరిస్థితులు లేవని మరోసారి నొక్కి చెప్పారు.



Next Story