- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడకత్తెరలో ఎమ్మెల్యే ‘గూడెం’..! ఏ పార్టీలోనూ చేరలేక అయోమయం
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ శరవేగంగా కొనసాగుతోంది. ఏఐసీసీ నుంచి చేరికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వరుసగా కండువాలు కప్పుతూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఏకంగా బీఆర్ఎల్పీని హస్తం పార్టీలో విలీనం బీఆర్ఎస్ పార్టీ అధినేతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. పావులు కదుపుతున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే పార్టీకి లేకపోవడం, అక్కడ సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రేవంత్ బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలపై కన్నేశారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీలను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో నగర పరిధిలో కాంగ్రెస్ బలం కాస్త పెరిగినట్లైంది.
కానీ, తాను కూడా పార్టీ మారుదామని ఫిక్స్ అయిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. వరుస ఈడీ దాడులతో సతమతం అవుతోన్న ఆయనకు పార్టీ మారుడు సవాలుగా మారింది. ఓ వైపు బీజేపీ తీర్థం పుచుకోవాలని అనుకున్నా.. పదవికి రాజీనామా చేసి పార్టీలోకి రావాలంటూ ఆ పార్టీ పెద్దలు షరుతు పెట్టారు. దీంతో ఆయన ఆ ప్రతిపాదనను విని వెనక్కి తగ్గారు. మరోవైపు అధికారంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధం కాగా అక్కడున్న స్థానిక నేతలు ఆయన చేరినకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా ఇన్నాళ్లు ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పటాన్‌చెరు ఇంచార్జ్ కాట శ్రీనివాస్‌కు మధ్య ఆయనకు సయోధ్య కుదిరేలా కనిపించడం లేదు. ఈ మొత్తం పరిణామాలతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిస్థితి అటు బీఆర్ఎస్ పార్టీని.. ఇటు కేడర్‌ను ఆయోమయానికి గురి చేస్తోంది.