అమ్మతోడు, అయ్యతోడు అనడం ఏం కల్చర్..? ఈటల రాజేందర్

by Satheesh |
అమ్మతోడు, అయ్యతోడు అనడం ఏం కల్చర్..? ఈటల రాజేందర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌కు రూ.25 కోట్లు అందించిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై అగ్గి రాజేసుకుంది. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని ఈటలకు సవాల్ విసిరారు. కాగా సవాల్ చేసినట్లుగానే భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. రేవంత్ సవాల్‌ను స్వీకరించకుండా ఈటల సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది. ఈ అంశమై ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.

తాను ప్రస్తుతం మాట్లాడలేనని.. అందరూ సంపూర్ణంగా మాట్లాడటం పూర్తయ్యాక అప్పుడు ఆలోచిస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరికీ సమాధానం చెబుతానన్నారు. పొలిటికల్ లీడర్ కాన్ఫిడెంట్‌గా ఉండాలని, రేవంత్ రెడ్డికి ఆయనపై ఆయనకే.. నమ్మకం లేకుండా పోయిందని, అందుకే దేవుడి వద్దకు వెళ్లారని వ్యాఖ్యానించారు. అమ్మతోడు, అయ్యతోడు అనేది ఏం కల్చర్ అని ఆయన ప్రశ్నించారు. తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినీ వ్యక్తిగతంగా చేసి మాట్లాడలేదని ఈటల క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత రాజకీయాలపైనే మాట్లాడినట్లు ఆయన తెలిపారు. కావాలంటే తనపై కేసులు పెట్టుకుంటే పెట్టుకోవచ్చని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story