- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ట్యాంక్‌బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టాలి: ఈటల
దిశ, వెబ్‌డెస్క్: ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఈటల మీడియాతో మాట్లాడారు. విగ్రహం ఏర్పాటు చేసి ప్రభుత్వమే జయంతి, వర్ధంతులు అధికారికంగా నిర్వహించాలని కోరారు. హుజురాబాద్‌లో మాదిరిగానే మునుగోడులోనూ అధికార దాహంతో టీఆర్ఎస్ పనిచేస్తోందని మండిపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు మేలు చేయలేని వ్యక్తి, జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటం, పార్టీ పెడతానని ప్రగల్బాలు పలకడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. మునుగోడులోనూ హుజురాబాద్ తీర్పు పునరావృతం కాబోతోందని జోస్యం చెప్పాడు.
Also Read : చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివి : MLC పాడి కౌశిక్ రెడ్డి