- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నా వల్లే హైదరాబాద్‌కు మెట్రో వచ్చింది.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు
by Gantepaka Srikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన సభలో మాట్లాడారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతానికి మెట్రో రైలును విస్తరించాలని డిమాండ్ చేశారు. తమతో తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్న కేటీఆర్. తెస్తున్నాం.. తెస్తున్నాం అంటూ కాలయాపన చేశారు తప్పా ఏనాడూ ముందడుగు వేయలేదని అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెట్రో హైదరాబాద్‌కు మెట్రో కావాలని తానే డిమాండ్ చేసినట్లు గుర్తుచేశారు. దీని కోసం ఆనాడు ముఖ్యమంత్రితో కలిసి ఢిల్లీకి వెళ్లినట్లు తెలిపారు. చివరకు పోరాడి తీసుకొచ్చామని.. కానీ, నా ప్రాంతంలోనే ఇప్పుడు మెట్రో సేవలు లేవు అని.. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు అని అన్నారు.
Next Story