Statue of Unity: స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సంద‌ర్శించిన మంత్రులు జూప‌ల్లి, తుమ్మ‌ల.. ఎందుకంటే?

by Ramesh N |
Statue of Unity: స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సంద‌ర్శించిన మంత్రులు జూప‌ల్లి, తుమ్మ‌ల.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ‌లో ప్ర‌పంచ స్థాయి ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు ఉన్నాయ‌ని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పెట్టుబడులను, ప‌ర్యాట‌కుల‌ను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో నూత‌న ప‌ర్యాట‌క విధానాన్ని తీసుకువ‌చ్చామ‌ని వెల్లడించారు. గుజరాత్‌లోని సత్పురా, వింధ్యాంచల్ పర్వత శ్రేణుల్లోని నర్మదా నది తీరంలో ఉన్న స‌ర్దార్ వ‌ల్ల‌బాయ్ ప‌టేల్ ఐక్య‌తా (Statue of Unity ) విగ్ర‌హాన్ని, టెంట్ సిటీని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (minister Jupalli Krishna Rao), వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు (tummala nageshwar rao) సంద‌ర్శించారు. తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధిలో భాగంగా దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించి, తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధికి ఉన్న అవ‌కాశాల‌ను అధ్య‌య‌నం చేస్తున్నామ‌ని దీంట్లో భాగంగానే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, టెంట్ సిటీని సంద‌ర్శించామ‌ని మంత్రి జూప‌ల్లి తెలిపారు.

2027, 2028 సంవ‌త్స‌రాల్లో తెలంగాణ జ‌ర‌గ‌నున్న గోదావ‌రి, కృష్ణ‌ పుష్క‌రాల‌కు సంబంధించి సంద‌ర్శకుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు టెంట్ సిటీలో ఉన్న వ‌స‌తుల‌ను అధ్య‌య‌నం చేశామ‌ని చెప్పారు. ఇలా తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధికి ఉన్న ప్ర‌తి అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు కృషి చేస్తున్నామ‌ని వెల్లడించారు. మంత్రుల వెంట ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ప‌టేల్ ర‌మేష్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ఎమ్మెల్యేలు క‌సిరెడ్డి నారాయ‌ణ రెడ్డి, బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి, డా. రాజేష్ రెడ్డి ఉన్నారు.



Next Story

Most Viewed