- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి చెప్పినా నో యూజ్.. సర్పంచుల్లో టెన్షన్!
గ్రామ పంచాయతీలకు రూ.1190 కోట్ల నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మినిస్టర్లు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. మే 23న సీఎస్ ను కలిసి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే వారం రోజులు దాటుతున్నా.. ఫండ్స్ రిలీజ్ కాలేదు. దీంతో దశాబ్ది ఉత్సవాల వేళ, ఏర్పాట్లు ఎలా చేసుకోవాలోనని సర్పంచులు టెన్షన్ పడుతున్నారు. మంత్రుల హామీ మాటలకే పరిమితమైందని వాపోతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: దశాబ్ది వేడుకల నిర్వహణలో పంచాయతీల అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం సుమారు రూ. 1,190 కోట్ల మేర ఉన్న బకాయిలను విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే ఆ నిధులు ఇప్పటికీ ఆర్థిక శాఖ నుంచి రిలీజ్ కాలేదు. జీపీలకు చేరలేదు. సర్పంచులు సైతం దీన్నే ధ్రువీకరించారు. మే 23న మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రధాన కార్యదర్శిని కలిసి పెండింగ్ బకాయిల విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు విడుదల చేయించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించినట్లు మంత్రులిద్దరూ స్పష్టం చేశారు.
అయితే వారం దాటిపోయినా ఆ నిధులు రిలీజ్ కాలేదు. దీంతో దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు, పనులు ఎలా చేయాలోనని సర్పంచులు, పంచాయతీరాజ్ అధికారులు టెన్షన్ పడుతున్నారు. అప్పుల పాలైన సర్పంచులు సర్పంచులకు గ్రామ పంచాయతీల నిర్వహణ భారంగా మారింది. అభివృద్ధి పనులు, ట్రాక్టర్ల కొనుగోలు కోసం అప్పులు చేశారు. నెల వాయిదాల పద్ధతిలో యంత్రాలను సమకూర్చుకున్నారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో ఈఎంఐల చెల్లింపు భారంగా మారింది. దీంతో వినతులు, ఆందోళనల రూపాల్లో సర్పంచులు వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పంచాయతీలుగా తెలంగాణ గ్రామాలను ఎంపికచేసి అవార్డులు ఇవ్వడంతో రాష్ట్ర అధికారులు, మంత్రులు మురిసిపోయినా.. క్షేత్రస్థాయిలో పేరుకుపోయిన అప్పులు, సర్పంచుల బాధలను మాత్రం పట్టించుకోవడం లేదు. మంత్రులు హామీ ఇవ్వడంతో ఇప్పుడైనా నిధులు వస్తాయని భావించినా, అది మాటల వరకే పరిమితమైందని సర్పంచులు పేర్కొంటున్నారు.
కేంద్రం రిలీజ్ చేస్తున్నా..
కేంద్ర నుంచి ఎప్పటికప్పుడు నిధులు రిలీజ్ అవుతున్నట్లు రాష్ట్ర అధికారులే అంగీకరిస్తున్నారు. ఈ నిధుల వినియోగం కోసం ప్రత్యేకంగా సర్పంచులు, ఉప సర్పంచులు కోసం తెరిచిన ఖాతాలకు డిజిటల్ ‘కీ’లను కూడా అధికారులు ఇచ్చారు. కానీ గ్రామ సర్పంచులకే తెలియకుండా నిధులను రాష్ట్ర ప్రభుత్వం డ్రా చేసుకుని తన అవసరాలకు వాడుకుంటున్నదని, అందుకే గ్రామాల అభివృద్ధికి ఇబ్బందులు ఏర్పడ్డాయంటూ సర్పంచులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. చివరకు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. ఆసిఫాబాద్ లో 18 మంది సర్పంచులు ఈ అంశంమీదనే మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ‘తెలంగాణ అమలు చేస్తున్నది.. దేశం అనుసరిస్తుంది...’ అంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా సర్పంచులకు నిధుల విడుదల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నది.
సర్కారు తీరుపై విమర్శలు..
ధనిక రాష్ట్రం అని గర్వంగా ప్రకటించుకుంటున్నా, బడ్జెట్‌లో ఏకరువు పెడుతున్నా సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని, జీపీలకు నిధులు ఎందుకు రిలీజ్ చేయడంలేదనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి క్రమం తప్పకుండా నిధులు విడుదలవుతున్నా పంచాయతీల అవసరాలకు ఉపయోగపడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించడం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులే చెబుతున్నారు. తెలంగాణకు ఇప్పటివరకు కేంద్రం నుంచి రూ. 10,810.45 కోట్లు వచ్చాయి. రాష్ట్రం తన వాటాగా రూ. 5,838.15 కోట్లను జమచేసింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైనదిగా భావించిన ‘పల్లెప్రగతి’ అవసరాలకు దాదాపు రూ. 11,500 కోట్లను విడుదల చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయినా జీపీలకు ఫండ్స్ రిలీజ్ లో జాప్యంపై విమర్శలు వస్తున్నాయి.
అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు...
ముఖ్యమంత్రి ఆదేశాలతో పల్లె ప్రగతి పనులను సర్పంచులు భుజాన వేసుకుని చేశారు. సర్కారు నిధులు లేకపోవడంతో అప్పులు చేసిమరీ ఉత్సాహంగా పూర్తిచేశారు. కానీ ఈ పనులకు ఖర్చయిన డబ్బుల్ని మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు. చెల్లింపులు లేకపోవడంతో అప్పులు తీర్చలేక, జవాబు చెప్పుకోలేక సుమారు 70 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకొందరు పదవికి రాజీనామా చేశారు. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న సమయంలో సర్పంచుల నుంచి నిరసనలు, ప్రతిఘటన రావొద్దని తక్షణం నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రులు చెప్పినా అది ఆ రోజుకే పరిమితమైందన్న చర్చ జరుగుతున్నది.
Also Read: లోక్‌సభ డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: KTR