వైఎస్ఆర్ వల్లే తెలంగాణ ఆలస్యమైంది: Minister Vemula Prashanth Reddy

by GSrikanth |   ( Updated:2022-11-29 15:38:03.0  )
వైఎస్ఆర్ వల్లే తెలంగాణ ఆలస్యమైంది: Minister Vemula Prashanth Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమైందని అన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌ను వీడుతానని వైఎస్ఆర్ సోనియాను బ్లాక్‌మెయిల్ చేశారని మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం వైఎస్ఆర్ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో వందలాది మంది విద్యార్థులు అమరులు అయ్యారని మండిపడ్డారు. వందలాది మంది మనబిడ్డల ప్రాణాలను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుందని వ్యాఖ్యానించారు. కాగా, వైఎస్ షర్మిల అరెస్ట్, వైఎస్ విజయమ్మ హౌజ్ అరెస్ట్ అయిన నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ తరహా కామెంట్లు చేయడం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.



Next Story

Most Viewed