Minister Uttam: బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా

by Gantepaka Srikanth |
Minister Uttam: బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌(Telangana - Andhra Pradesh) రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్(Brijesh Kumar Tribunal) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ‘అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్’పై మొదట విచారణ చేపట్టాలని ట్రైబ్యునల్ నిర్ణయించింది. మొదట వాదనలు వింటామని.. 811 టీఎంసీల్లో రెండు రాష్ట్రాల వాటా తేల్చడం ముఖ్యమని ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. వచ్చే ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు విని.. ఆ తర్వాతే ప్రాజెక్టుల వారీగా కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

తాజాగా.. ట్రైబ్యునల్ నిర్ణయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) స్పందించారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణకు సరైన న్యాయం జరిగేందుకు ఈ తీర్పు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. బచావత్ ట్రైబ్యునల్ ఎన్ బ్లాక్‌గా కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కనుందని తెలిపారు.

Next Story