Uttam Kumar Reddy: కౌశిక్ రెడ్డి తీరును అలాగే భావిస్తున్నా

by Gantepaka Srikanth |
Uttam Kumar Reddy: కౌశిక్ రెడ్డి తీరును అలాగే భావిస్తున్నా
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. గంగుల కమలారెడ్డి గురించి మాట్లాడినప్పుడు ఏ పార్టీ అని అడగలేదని అన్నారు. సమావేశాన్ని డైవర్ట్ చేయడానికి రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌(Karimnagar Collectorate)లో నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది.

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లు ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. అనంతరం మంత్రులు మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఎదుటే తోసుకున్నారు. సమావేశం అనంతరం పాడి కౌశిక్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ బీఫామ్‌తో గెలిచి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని సంజయ్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేని అంటూ చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ తరపున గెలిచి కాంగ్రెస్‌ తరఫున మాట్లాడితే మేం చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు.



Next Story

Most Viewed