ఇంత అహంకారం పనికిరాదు.. జగదీష్ రెడ్డిపై మంత్రి ఉత్తమ్ ఫైర్

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-13 09:53:31.0  )
ఇంత అహంకారం పనికిరాదు.. జగదీష్ రెడ్డిపై మంత్రి ఉత్తమ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌(Gaddam Prasad Kumar)పై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) స్పందించారు. గురువారం అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ చిట్‌చాట్ నిర్వహించారు. దళిత స్పీకర్‌పై జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. స్పీకర్‌పై ఒక సభ్యుడు ఇంత అహంకారంగా మాట్లాడటం నేనెప్పుడూ చూడలేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో స్పీకర్ చైర్‌కు కొన్ని అధికారాలు ఉంటాయి.. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై స్పీకర్ తక్షణమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి.. ఈ అంశాన్ని అంత సులువుగా వదిలేయొద్దు అని డిమాండ్ చేశారు. మరోవైపు.. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ మనస్తాపం చెందారు. దీంతో జగదీష్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. స్పీకర్‌పై ఇంత అహంకారంగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.

కాగా, అంతకుముందు సభలో జగదీష్ రెడ్డి(Jagadish Reddy) మాట్లాడుతూ.. ‘మేము కూడా ప్రజలు ఎన్నుకుంటేనే సభలోకి వచ్చాం. మీరు మేము ఎన్నుకుంటేనే స్పీకర్ అయ్యారు. ఈ సభ మీ సొంతమేం కాదు’ అని స్పీకర్‌ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress MLAs) రెచ్చిపోయారు. మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) జోక్యం చేసుకుని జగదీష్ రెడ్డి స్పీకర్‌ను బెదిరిస్తున్నారని.. ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పాలని అన్నారు.


Read More..

CM Revanth: అలా ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదు.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు



Next Story

Most Viewed