- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Uttam: తేడా వస్తే చర్యలుంటయ్.. మంత్రి ఉత్తమ్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: రబీ సీజన్ నుంచి రైతు భరోసా(Rythu Bharosa) ప్రారంభం అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నేరెడుచర్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గడిచిన ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులతో అధోగతి పాలు చేసినా యావత్ భారతదేశంలోనే ఏక కాలంలో 21 లక్షల మంది రైతాంగానికి 18 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వా(Congress Govt)నికి దక్కిందన్నారు. మిగిలిన రైతాంగానికి రేపోమాపో రుణమాఫీ(Runa Mafi) అవుతుందని తెలిపారు. రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం మొదటి ఐదేళ్లలో వడ్డీ చెల్లించి, రెండోసారి అధికారంలోకి వచ్చాకా అరకొర చెల్లిస్తూ ఎన్నికల వేళ లబ్ధి పొందేందుకు హడావుడి చేసిందని విమర్శించారు.
యువతను ఉన్నత శిఖరాలకు చేర్చడమే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న కర్తవ్యమని అందులో భాగంగానే ప్రపంచ స్థాయి సమీకృత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో హుజుర్నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. అయితే రహదారుల నిర్మాణంలో తేడాలు ఉండొద్దని.. నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. నాణ్యత లోపించినట్లు ఫిర్యాదులు వస్తే విచారణ జరిపించి సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లో పెట్టడంతో పాటు అధికారులపై చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు.