వాళ్లందరికీ వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
వాళ్లందరికీ వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీపైన అవకాశవాద శక్తులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ ఫ్రెంట్‌(Moosey River Front)ను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో చెరువులను, మూసీ ఆక్రమణలను తొలగిస్తున్నామని అన్నారు. తెలిసో, తెలియకనే కొందరు మూసీలో ఇళ్లు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు.. అలాంటి పేదలను నిలబెట్టాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. పడగొట్టాలని కాదని చెప్పారు. మూసీ రివర్ బెడ్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నారని స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులకు పూర్తి భరోసా ఇస్తున్నాం.. ఇప్పటికే వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారని గుర్తుచేశారు.

నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం.. వారందరిని కాపాడే బాధ్యత తమది అని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలను తీసుకొవచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. గోదావరి నీటిని మూసీ నదిలో ప్రవహింపజేస్తాం.. ఈస్ట్, వెస్ట్ సైడ్‌లో రోడ్లు వేస్తామని కీలక ప్రకటన చేశారు. మూసీ పైన ప్లై ఓవర్లు నిర్మిస్తాం.. పీపీపీ మోడల్‌లో నిర్మాణాలు ఉంటాయని అన్నారు. ప్రపంచంలోనే బెస్ట్ సిటీ‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని తెలిపారు. 35 టీంలతో సోషియో ఎకనమిక్ సర్వే చేస్తున్నాం.. వాక్ టు వర్క్ పద్ధతిలో ఉపాధి కల్పిస్తాం.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయం చూపిస్తున్నాం.. 12 ఎన్జీవో ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నాం.. సొంత ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం.. వివిధ ప్రభుత్వ శాఖలు బాధితులకు ఉపాధి కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి..

అంగన్ వాడీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తాం.. ఆరేళ్ల పాటు చదివిస్తాం.. స్వయం సహాయక మహిళా గ్రూపులతో వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం.. పునరావాసం కోసం హైలెవల్ కమిటీ పనిచేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రివర్ బెడ్ గుర్తించే నివాసాలకు కూడా భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లిస్తామని అన్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసని చురకలు అంటించారు. మల్లారెడ్డి అనే రైతు చితిపెట్టుకొని ఆహుతయ్యాడని గుర్తుచేశారు. భూనిర్వాసితులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని మండిపడ్డారు. హైడ్రా విషయంలో పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story