Minister Sridhar Babu: వారిని షిఫ్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అదే

by Gantepaka Srikanth |
Minister Sridhar Babu: వారిని షిఫ్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అదే
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా ప్రభుత్వంలో పేదలను గౌరవంగా బతికేలా నిలపెడతామని, ఎట్టి పరిస్థితుల్లో వాళ్లను కిందికి పడగొట్టమని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వరదలు వచ్చిన ప్రతీసారి ముసీ పరివాహక ప్రాంతాల్లోని పేదలకు నష్టం జరుగుతుందని, అందుకే ఇప్పుడు షిప్ట్ చేస్తున్నామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ ఫ్రెంట్‌ను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. చెరువులు, మూసీ ఆక్రమణలను తొలగిస్తామన్నారు. కొందరు తెలియక మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారని, వాళ్లకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం మూసీ రివర్ బెడ్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నామన్నారు. మూసీ నిర్వాసితులకు పూర్తి భరోసా ఇస్తున్నామని, వాళ్లకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారన్నారు. నిర్వాసితులందరిని కడుపులో పెట్టుకొని చూస్తామన్నారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలను తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. గోదావరి నీటిని మూసీ నదిలో ప్రవహింప చేస్తామన్నారు. ఈస్ట్, వెస్ట్ సైడ్‌లో రోడ్లు వేస్తామన్నారు. మూసీ పైనా ప్లై ఓవర్లు నిర్మిస్తామని, పీపీపీ మోడల్‌లో నిర్మాణాలు ఉంటాయన్నారు. ప్రపంచంలోనే బెస్ట్ సిటీ‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామన్నారు. 35 టీమ్ లతో సోషియో ఎకనమిక్ సర్వే చేస్తున్నామన్నారు.

వాక్ టు వర్క్ పద్ధతిలో ఉపాధి కల్పిస్తామన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయం చూపిస్తున్నామన్నారు. 12 ఎన్జీవో ప్రతినిధులతో సంప్రదింపులు చేశామన్నారు. సొంత ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు బాధితులకు ఉపాధి కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి, ఆరేళ్ల పాటు చదివిస్తామన్నారు. స్వయం సహాయక మహిళా గ్రూపులతో వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామన్నారు. పునరావాసం కోసం హైలెవల్ కమిటీ పనిచేస్తోందన్నారు. రివర్ బెడ్ గుర్తించే నివాసాలకు కూడా భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లిస్తామన్నారు. మూసీ మాస్టర్ ప్లాన్ బ్లూ ప్రింట్ తయారు చేశామన్నారు. పనులు పారదర్శకంగా పూర్తి చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న సంస్థలనే ఆహ్వానిస్తున్నామన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ హైడ్రా ఆపరేషన్ ను భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ నాయకులు ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.

మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసని చురకలు అంటించారు. మల్లారెడ్డి అనే రైతు చితిపెట్టుకొని ఆహుతయ్యాడని గుర్తు చేశారు. 2013 భూనిర్వాసితుల చట్టాన్ని అమలు చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జీవో తీసుకువచ్చిందన్నారు. మల్లన్న సాగర్ భూనిర్వాసితులు విషయంలో హైకోర్టు అనేక సార్లు మొట్టికాయలు వేసిందన్నారు. అరాచక శక్తులను బీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని, డబ్బులు ఇచ్చి సీఎం, తమ ప్రభుత్వంపై బురద జల్లిపిస్తుందన్నారు. మూసీ, హైడ్రా విషయంలో అనుమానాలు ఉంటే అన్ని కలెక్టరేట్లలో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తామన్నారు. చట్టబద్దంగా, ప్రణాళిక యుతంగా మూసీ, హైడ్రా పైన ముందుకు వెళ్తున్నామన్నారు. అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులపైనా చర్యలు ఉంటాయన్నారు. బిల్డర్ల చేతిలో మోసపోయిన వారి విషయంలోనూ మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed