- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ ఒక్క డైలాగ్‌తో కేటీఆర్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని.. లేదంటే వారి తరుఫున గొంతు విప్పుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సర్పంచ్‌లకు నిధులు ఇవ్వకుండా బాధపెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ నేతలు, మాజీ మంత్రి కేటీఆర్ సర్పంచ్‌ల కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని సీతక్క ఎద్దేవా చేశారు. సర్పంచుల కోసం పోరాడుతామని కేటీఆర్ అనడం.. వెయ్యి పశువులను తిన్న రాబందు నీతి కథలు చెప్పినట్లు ఉందని సీతక్క దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పెండింగ్ బిల్లులు రాక ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఫైర్ అయ్యారు. ఇంట్లో ఆడవాళ్ల పుస్తెల తాళ్లు అమ్మి మరీ అభివృద్ధి పనులు చేస్తే.. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో చేసేదేమి లేక ఎంతో మంది సర్పంచులు సూసైడ్ చేసుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని సర్పంచుల ఆత్మహత్యలకు బీఆర్ఎస్ పార్టీనే కారణమన్నారు.