- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ బాధ్యత అందరిపై ఉంది.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) కోరారు. గత పదేళ్లుగా పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేసిన మల్లన్నను గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉన్నదని ఆమె శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతు, పట్టభద్రుల ఆత్మబంధువు తీన్మార్ మల్లన్న అని కొనియాడారు. పట్టభద్రుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ తీన్మార్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసిందన్నారు. దొరల పాలన సాగించిన కేసీఆర్‌పై తీన్మార్ తనదైన శైలిలో పోరాటం చేశారని, ప్రజల పక్షాల నిలిచి ఫైట్ చేశారన్నారు. అలాంటి వ్యక్తులను చట్ట సభల్లోకి పంపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నదన్నారు.
పూర్ణకు మంత్రి సీతక్క బ్లెస్సింగ్స్..
రాష్ట్రానికి చెందిన పర్వతారోహకురాలు పూర్ణ మాలావత్ అతి పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించింది. ఎవరెస్టు ఎక్కి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆమె శనివారం తన కుటుంబ సభ్యులతో కలసి మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూర్ణను సీతక్క అభినందించారు. పూర్ణ ఎవరెస్ట్ శిఖరంతో పాటు, ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్‌లోని ఎల్‌బ్రస్, దక్షిణ అమెరికాలోని అకోన్‌కాగస్, ఓసెనియాలోని కార్టెన్జ్ పిరమిడ్, అంటార్కిటికాలోని విన్సన్, ఉత్తర అమెరికాలోని దెనాలి శిఖరాలను వంటి అతి ఎత్తైన పర్వతాలను అధిరోహించిన ‘ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలు’గా పూర్ణ చరిత్ర సృష్టించిందని మంత్రి కొనియాడారు.