- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నోరు అదుపులో పెట్టుకో.. షర్మిలకు మంత్రి సత్యవతి వార్నింగ్
దిశ, డైనమిక్ బ్యూరో: నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దని, నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే, ఎంపీలపై షర్మిల చేసిన అనుచిత వాఖ్యలపై ఆదివారం సత్యవతి రాథోడ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజన్న రాజ్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగిందని, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చి విమర్శలు చేస్తారు? అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్, తెలంగాణ ఉద్యమకారులపై వ్యక్తిగత దూషణలు చేస్తే ఇక సహించేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అండదండలతో వైఎస్సార్ సీఎం అయి ఈరోజు వైఎస్ కుటుంబం కోట్ల ఆస్తులకు యజమానులు అయ్యారని ఆరోపించారు. అలాంటి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని తుంగలో తొక్కి ఆ పార్టీ ద్వారా సంపాదించుకున్న వేలకోట్లతో వేరే పార్టీ పెట్టి ఊరేగుతున్నారు అంటూ విమర్శించారు. ఇప్పటికైనా పరిమితుల మేరకు పాదయాత్ర చేసుకోవాలన్న ఆమె.. అతిక్రమించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
Also Read..