- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యార్థుల భావోద్వేగ నైపుణ్యాలపై విద్యాశాఖ కసరత్తు.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థుల్లో సామాజిక-భావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. సోమవారం తన కార్యాలయంలో విద్యాశాఖ పని తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వారికి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఢిల్లీ తరహా విధానాన్ని ఇక్కడ అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల విశ్వాసం, మానసిక, భావోద్వేగ శ్రేయస్సు, సామాజిక నైపుణ్యాలు దెబ్బతినకుండా వారిలో మనోస్థైర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాకు ఒక పాఠశాల చొప్పున 6, 7 వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని అమలుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థుల్లో ప్రతికూల పరిస్థితులను, ఇబ్బందులను తొలగించి భవిష్యత్ పై ఆశావాద దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఇందుకోసం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇద్దరేసి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థి దశలోనే వ్యాపార ఆవిష్కరణలు ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. మొదటి దశలో 8 జిల్లాలోని 24 మోడల్ స్కూళ్లను ఎంపిక చేసి అందులో ఇంటర్ మొదటి సంవత్సరం చదివే 2500 మంది విద్యార్థులను వ్యాపార ఆవిష్కరణలపై ప్రోత్సహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందులో మెరుగైన 1500 ఆవిష్కరణలను ప్రోత్సహించి. ఒక్కో ఆవిష్కరణకు రూ.రెండు వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. వీరితో ప్రత్యేక ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేసి, వీరిని భవిష్యత్ లో ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు.