త్యాగాలు నిరంతరం జ్వలించేలా అమరవీరుల స్థూపం నిర్మాణం: మంత్రి ప్రశాంత్ రెడ్డి

by Satheesh |
త్యాగాలు నిరంతరం జ్వలించేలా అమరవీరుల స్థూపం నిర్మాణం: మంత్రి ప్రశాంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా దీపం ఆకృతి వచ్చేలా స్మారకం నిర్మాణం చేపడుతున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ తుది దశ పనులను మంగళవారం పరిశీలించారు. మెయిన్ ఎంట్రన్స్ వద్ద జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అధికారులు, వర్క్ ఏజెన్సీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు, వర్క్ ఏజన్సీని ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నిర్మాణం అరుదైన స్టెయిన్ స్టీల్‌తో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద కట్టడం అన్నారు.

ఎక్కడైతే అవమానించబడ్డమో ఇప్పుడు అదే ప్రాంతంలో కేసీఆర్ తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మిస్తున్నారన్నారు. త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆర్ అండ్ బీఈఎన్సీ గణపతి రెడ్డి, సీ.ఈ మోహన్ నాయక్, ఎస్.ఈ లు లింగారెడ్డి, సత్యనారయణ, హఫీజ్, ఈ.ఈ నర్సింగ రావు, డి.ఈ మాధవి, ఎ.ఈ ధీరజ్, శిల్పి రమణారెడ్డి, కెపిసి నిర్మాణ సంస్థ ప్రతినిధి కొండల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed