పూర్వ వైభవం తీసుకొచ్చి తీరుతాం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
పూర్వ వైభవం తీసుకొచ్చి తీరుతాం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) మహా నగరానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సమిష్టిగా కృష్టి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూసీ రివర్ ఫ్రంట్ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నిర్వాసితులను ఆదుకున్న తర్వాతే పని ప్రారంభిస్తామని కీలక ప్రకటన చేశారు. మూసీని శుద్ధి చేయడానికి రూ.500 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. విపక్షాల కుట్రను హైదరాబాద్ ప్రజలు గమనిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మూసీ బఫర్‌ జోన్‌, FTLను ఎక్కడా ముట్టుకోలేదు. మూసీ రివర్‌ బెడ్‌ నివాసాల సర్వే జరుగుతుంది.. పునరావాసం కల్పి్స్తాం. ‘ప్రజలపై ప్రేమ ఉంటే నన్ను కలిసి మీ అభిప్రాయం పంచుకోండి కేటీఆర్‌’ అని పొన్నం సూచించారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు మాటలు చెప్పారు తప్పా.. ఏనాడూ పనిచేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు తాము పనిచేస్తుంటే విద్వేశాలు రెచ్చగొడుతున్నారని సీరియస్ అయ్యారు. కాగా, ప్రభుత్వ స్థలాల్లో, చెరువుల ఎఫ్‌టీఎల్‌లో, బఫర్ జోన్లలోని నిర్మాణాలను తొలగించడంలో హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అధికారాలను అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆక్రమణలను గురించి తొలగిస్తున్నారు. ఇటీవల అధికారులు సర్వే సైతం నిర్వహించి కూల్చబోయే నిర్మాణాలకు రెడ్ మార్క్ వేశారు. ఇందులో భాగంగా ఇల్లు కోల్పోయిన నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story