- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ponnam Prabhakar: దానిని పరిచయం చేయాల్సిన టైమొచ్చింది.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పడి ఏడాది సమీపిస్తుండటంతో ఆదాయాన్ని పెంచుకోవడానికి నిర్దేశించిన లక్ష్యాన్ని ఎంత వరకు చేరుకున్నామని స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్(Vikas Raj)తో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రవాణా శాఖ(Transport Department) అధికారులు పాల్గొన్నారు. పలువురు అధికారుల పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా ఆదాయ అన్వేషణ చేయాలని సూచించారు. వచ్చే కొద్ది రోజుల్లో రెవెన్యూ పెంచుకున్న నివేదిక కనిపించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 62 రవాణా శాఖ కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరు, కార్యాలయాలకు అవసరమైన కొత్త భవనాలు, మౌళిక సదుపాయాలు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల వినియోగం తదితర అవసరాలపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు సేఫ్టీపై స్కూల్లు, కాలేజీలలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి స్కూల్‌లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేయాలని, కొత్తగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా ఇది తప్పనిసరి ఉండేలా విద్యాశాఖతో మాట్లాడాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం యునిసెఫ్(UNICEF) సహకారం తీసుకోవాలని ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ లైసెన్స్ పొందే ముందు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తామన్న వారికి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
రవాణా శాఖలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లు పూర్తి చేయాలని అందుకు సంబంధించి నివేదిక తయారు చేయాలని సూచించారు. కింది స్థాయి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నుండి జేటీసీ వరకు ప్రమోషన్లు పూర్తి చేయాలన్నారు. ప్రమోషన్లు పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్కూల్ బస్సులపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. 15 సంవత్సరాలు దాటిన స్కూల్ బస్సులను సీజ్ చేయాలని ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా ఫిట్నెస్, ఇన్స్యూరెన్స్, ఆర్సీ అన్నిటినీ చెక్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 వేల స్కూల్ బస్సులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా స్కూల్ టైమింగ్స్‌లో విద్యార్థులు బస్సుల్లో ఉన్నప్పుడు కానీ తనిఖీలు చేయరాదని అధికారులకు సూచించారు. అదే విధంగా 15 ఏళ్లు దాటిన ప్రైవేట్ వాహనాలు గ్రీన్ టాక్స్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు.
ఈవీ పాలసీపై మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఈవీ కంపెనీలు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను అభినందించారు. దేశ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా కాలుష్యాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈవీ పాలసీపై విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని దీనిపై ప్రతి ఎలక్ట్రిక్ వాహనాల షో రూంల వద్ద ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సీఎస్‌ఆర్ ఫండ్స్‌తో స్కూల్‌లలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్‌లు ఏర్పాటు చేయాలని ఈవీ కంపెనీల ప్రతినిధులు కోరారు. ఆటోమాటిక్ టెస్టింగ్ స్టేషన్స్, టెస్టింగ్ ట్రాకింగ్, డ్రైవింగ్ టెస్టింగ్, వెహికిల్ ట్రాకింగ్‌పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాహన సారథి అమలు ఆలస్యం చేయవద్దని సూచించారు. కొత్తగా వచ్చిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్‌లను ఎన్ఫోర్స్మెంట్‌లో ఉపయోగించాలని వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. రవాణా శాఖకి ప్రత్యేక లోగో రాబోతుందని ప్రజా విజయోత్సవాల్లో దానిని పరిచయం చేయాలని సూచించారు. రవాణా శాఖ అధికారులకు ప్రత్యేక వాహనాలు రాబోతున్నాయని, దాంతో పాటు డేటా ఎంట్రీ కోసం టాబ్‌లు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న డ్రైవింగ్ స్కూల్‌లు ఎన్ని వాటి పనితీరు తదితర వాటిపై ఎన్ఫోర్స్మెంట్ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో రవాణా శాఖ ప్రత్యేక శాఖ కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, జేటీసీ రమేష్, మమత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.