- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: బీసీ బంధు స్కీమ్ నిలిపివేత: మంత్రి పొన్నం కీలక ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో బీసీ బంధుపై రివ్యూ నిర్వహిస్తామని రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అప్పటి వరకు తాత్కాలికంగా పంపిణీని నిలిపివేస్తామన్నారు. బీసీ బంధు ప్రాసెస్‌ను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. గత ప్రభుత్వం గందరగోళం సృష్టించిందన్నారు. దీని వలన అర్హులకు స్కీమ్‌లు అందే పరిస్థితి లేదన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తుక్కుగుడ విజయభేరీ సభలో సోనియా గాంధీ ఇచ్చిన ఆరు హామీల్లో రెండింటినీ అమలు చేశామన్నారు. మిగతా గ్యారంటీలను కూడా అతి త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. కాంగ్రెస్ అంటేనే భరోసా అన్నారు.
ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేలకు పైగా బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణా సౌకర్యం కల్పించామన్నారు. ప్రతి రోజు సగటును 45 లక్షల మంది మహిళలు జర్నీ చేస్తున్నారన్నారు. ఆడబిడ్డలంతా ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. బడ్జెట్ ఎంత ఖర్చైనా ప్రభుత్వమే మేనేజ్ చేస్తుందన్నారు. మరోవైపు ఆర్టీసీ పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం కాలేదని, అతి త్వరలో ఆర్టీసీపై ఓ రివ్యూ నిర్వహించి ఉద్యోగులు, ప్రజలకు మేలు జరిగేలా ముందుకు వెళ్తామన్నారు. సంక్షేమంలో మార్పులు చూపించేందుకు కాంగ్రెస్ చొరవ చూపుతుందన్నారు.
ఇక మాజీ మంత్రులు రైతు బంధుపై విమర్శలు చేయడం విచిత్రంగా ఉన్నదన్నారు. ప్రభుత్వం వచ్చి వారం రోజులు కూడా పూర్తి కాలేదని, అప్పుడే విమర్శలు చేయడం ఆశ్చర్యకరంగా ఉన్నదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. తప్పకుండా అన్నింటినీ అమలు చేస్తామన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలోని అంశాలను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. అధికారం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ నేతలు అర్ధరహిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
రూరల్ ప్రజలంటే మక్కువ
అర్బన్‌తో పోల్చితే రూరల్ ప్రజలతోనే తనకు ఎక్కువ సంబంధాలు ఉన్నాయని మంత్రి పొన్నం పేర్కొన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించానన్నారు. అందుకే ఆ రిలేషన్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయన్నారు. పేద ప్రజల కష్ట, నష్టాలకు నిత్యం అండగా ఉంటానన్నారు. దీంతోనే హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నానన్నారు.
బండి సంజయ్ ఒడిసిన అధ్యయనం
కరీంనగర్ బండి సంజయ్ ఒడిసిన అధ్యయనం అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆయన గ్రౌండ్‌లో లేడన్నారు. కరీంనగర్ ప్రజలకు దూరంగా ఉన్నాడన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక ఆయన్ను కొన్ని మీడియా సంస్థలు ఆకాశానికి ఎత్తేశాయన్నారు. ముస్లింలపై, ప్రభుత్వంపై వ్యగ్యంగా విమర్శలు చేయడం వలన మీడియా సంస్థలు కూడా ఆయన్ను హైలెట్ చేశాయన్నారు. కానీ బండి సంజయ్‌కు సబ్జెక్టు లేదన్నారు. ఆయన బండికి పంక్చర్ అయింది కాబట్టే బీజేపీ అధ్యక్ష పదవి పోయిందన్నారు.