వారికి మేలు జరిగేలా రెవెన్యూ శాఖ ప్రక్షాళన.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
వారికి మేలు జరిగేలా రెవెన్యూ శాఖ ప్రక్షాళన.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సామాన్యులకు మేలు జరిగేలా రాష్ట్ర రెవెన్యూ శాఖ(revenue department) ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తహశీల్దార్ల బదిలీపైన కూడా అతి త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. అంతేకాదు.. తహశీల్దార్లపై కేసుల విషయంలో కలెక్టర్ల అనుమతి తప్పనిసరి అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. గత ప్రభుత్వం రూపొందించిన ధరణితో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు.

ఒక్కొక్కటిగా తాము అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలు అన్నీ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తహశీల్దార్లకు గ్రామీణ ప్రజలకు ఎలా సర్వీస్ చేయాలో తెలుసని.. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తహశీల్దార్ ఆఫీస్‌లో ఎలాంటి వసతులు ఉండేవి కాదని గుర్తుచేశారు. తహశీల్దార్లకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న తహశీల్దార్లలో 90 శాతం మంది రైతు కుటుంబం నుంచే వచ్చారని.. వారికి అన్నదాతల బాధ తెలుసని.. అందుకే వారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా రైతులకు పని చేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed