‘తెలంగాణను నాశనం చేశారు’.. కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి ఫైర్

by Satheesh |
‘తెలంగాణను నాశనం చేశారు’.. కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని రైతులను కేసీఆర్ రెచ్చగొడుతున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే తాగు, సాగు నీటి కొరత అంటూ దుష్ప్రాచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉండి లక్షల కోట్లు ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వం ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణలో తాగు, సాగు నీటి కొరత లేకుండా చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story