- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకుపచ్చని తెలంగాణలో BJP అగ్గి రాజేస్తుంది: కొప్పుల ఈశ్వర్
దిశ, తెలంగాణ బ్యూరో: ఆకుపచ్చని తెలంగాణలో బీజేపీ అగ్గి రాజేస్తున్నది. ఇక్కడ నెలకొన్న మత సామరస్యాన్ని, ప్రశాంతతను దెబ్బతీసే కుట్ర చేస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మహహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని, ఎమ్మెల్సీ కవిత ఇంటిపై గుండాలు దాడికి పాల్పడడాన్ని ఒక ప్రకటనలో మంత్రి కొప్పుల తీవ్రంగా ఖండించారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట సంజయ్ ప్రజల మధ్య విబేధాలు సృష్టిస్తున్నారని, చిచ్చుపెడుతున్నారని, ప్రజలపై యుద్ధానికి దిగారని నిశితంగా విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో బడుగు, బలహీన వర్గాల వారికి, మైనారిటీలకు కనీస హక్కులు లేవని, బిక్కు బిక్కుమంటూ జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ గొప్ప లౌకిక రాష్ట్రంగా వర్థిల్లుతుండడాన్ని,అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెందుతుండడాన్ని చూసి బీజేపీ నాయకులు ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారని,వి షం చిమ్ముతున్నారని ఈశ్వర్ దుయ్యబట్టారు. పరమత సహనం పాటించకుండా అడ్డుగోలు వ్యాఖ్యలు చేయడం, ఇతర మతస్తుల మనోభావాలను కించపర్చడం, మహిళల పట్ల కనీస గౌరవం లేని బీజేపీ గుండాలు ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి పాల్పడడం సరికాదన్నారు. రాజాసింగ్ పై, బీజేపీ గుండాలపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీని మంత్రి కొప్పుల కోరారు.