ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలం, ధైర్యం రెండూ వాళ్లే.. రాష్ట్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలం, ధైర్యం రెండూ వాళ్లే.. రాష్ట్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక(Graduate MLC Elections)ల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి(Narender Reddy)ని గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. శనివారం సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నరేందర్ రెడ్డి చాలా గ్రౌండ్ వర్క్ చేశారు.. ఆయన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిమీదా ఉందన్నారు. రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా, మెదక్ ఎంపీగా గెలిచి ఏం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్(BRS) క్రాస్ ఓటింగుతో బీజేపీ వాళ్లు గెలిచారని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా కేటాయించారని.. మరోసారి బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. ప్రజలకు కాంగ్రెస్ ఏం చేసిందో మనమే చెప్పుకోవాలని సూచించారు.

గ్రాడ్యుయేట్ ఓటర్లను స్వయంగా కలిసి కాంగ్రెస్‌కు ఓటు వేయించాల్సిన బాధ్యత కార్యకర్తలదే అని అన్నారు. ఇది మన సిట్టింగ్ సీటు.. తప్పకుండా మనం కాపాడుకోవాలని అన్నారు. ఇది గెలిపించి.. మన నాయకుడు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలం ప్రజలు.. ధైర్యం కాంగ్రెస్ కార్యకర్తలే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం దిశగా పనిచేస్తారని అన్నారు. నరేందర్ రెడ్డి తప్పకుండా గెలుస్తున్నాడని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారని ఇదే ఊపు కొనసాగించి గెలుపు దిశగా పనిచేయాలని మంత్రి కొండా సురేఖ కోరారు.

Next Story

Most Viewed