- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sankranti Effect: తెలంగాణ యువతకు మంత్రి కొండా సురేఖ కీలక రిక్వెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) భోగి, సంక్రాంతి(Sankranthi) పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. రైతు రుణమాఫీ, సకాలంలో ధాన్యం కొనుగోళ్లు, సన్నాలకు 500 రూపాయల బోనస్ తదితర కార్యక్రమాలతో ప్రజల్లో హర్షం వ్యక్తం అయిందని అన్నారు. దీంతో పాటు ఈ ఏడాది నుంచి రైతులు, వ్యవసాయ కూలీలకు అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma Atmiya Bharosa) పథకాలు, పేద ప్రజలకు ఉద్దేశించిన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక తదితర కార్యక్రమాలతో వ్యవసాయ కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తున్నదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం భోగభాగ్యాలతో, సిరిసంపదలతో సమృద్ధిగా వర్ధిల్లాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. పతంగులను ఎగరవేసే సమయంలో చైనా మాంజాను వాడి పశుపక్ష్యాదులకు హాని కలిగించవద్దని మంత్రి యువతను కోరారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా మంచి జరగాలని మంత్రి సురేఖ భగవంతుని ప్రార్థించారు. కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ వ్యాప్తంగా జనవరి 16 నుంచి 20 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పారు. లబ్ధిదారుల ముసాయిదా జాబితాను 21 నుంచి 24 వరకు గ్రామ, వార్డు సభల్లో పెట్టి ప్రజాబిప్రాయం తీసుకుంటామని అన్నారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. రేషన్ కార్డుల దరఖాస్తులకు గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని అన్నారు.