- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మూసీ విషయంలో వెనక్కి తగ్గం: రేవంత్ పాదయాత్రలో మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: మూసీ నది విషయంలో వెనక్కి తగ్గమని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేపట్టిన మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర(Musi Punarujjeavanam Sanklpa Padayatra)లో ఆయన పాల్గొన్నారు. మూసీ ప్రక్షాళనపై ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నదిని మంచి నీటి సరస్సుగా మార్చుతామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూసీ నదిని ప్రక్షాళన చేద్దామనుకున్నామని, సీమాంధ్ర పాలనలో నిధులు ఇవ్వకపోవడంతో చేయలేకపోయామని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో మూసీని పట్టించుకోలేదన్నారు. త్వరలోనే మూసీ నది నీటిని సుద్ధీకరణ చేపడతామని, నల్గొండ ప్రజలకు గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు. నిజాం కాలంలో మూసీ నది ఎలా ఉందో అదే విధంగా చేయాలని సీఎం నిర్ణయించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
అమెరికాలో చదువుకున్న మాజీ మంత్రి కేటీఆర్‌కు జ్ఞానం ఉందని అనుకున్నామని, అవసరం లేకపోయినా 50 వేల ఎకరాల భూమి సేకరించి మల్లన్న సాగర్ కట్టారని, ఆ నీళ్లు కిందకుగాని, పైకిగాని పోవడంలేదని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్‌కు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని, రూ. 7 లక్షల కోట్లు అప్పు చేశారని మంత్రి వ్యాఖ్యానించారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని తెలిపారు. కేసుల విచారణలో తప్పు తేలితే ఎంత పెద్దవాళ్లకైనా జైలు తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయని ప్రచారం చేసే వ్యక్తులు పిచ్చోళ్లని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు.