- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇలాంటి పప్పులు సీఎం కేసీఆర్ ముందు ఉడకవు: మంత్రి
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం రోజున ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై మంత్రి తీవ్రంగా స్పందించారు. కేంద్రప్రభుత్వం దుర్మార్గాలు పరాకాష్టకు చేరాయని అన్నారు. బీజేపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. రాజకీయ దురుద్ధేశంతోనే ఇవాళ నోటుసులు జారీ చేశారని అన్నారు. ఢిల్లీలో ఆప్, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలో భాగమే అని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే అని వెల్లడించారు.
ఇటువంటి పప్పులు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ఉడకవని సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్‌ను నిలువరించగలం అనుకోవడం మూర్ఖత్వం అని అన్నారు. మోడీ దుర్మార్గాలకు కాలం చెల్లిందని, బీజేపీ సర్కార్‌ను గద్దె దింపే వరకు పోరాటం చేస్తామని అన్నారు. కేసులు, జైళ్లు మాకు కొత్త కాదని, ప్రజల కోసం పనిచేసేవారికి ఇవి తప్పవని వెల్లడించారు. 2001లో రాష్ట్ర సాధన కోసం ఉద్యమం మొదలు పెట్టిన రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది ఇదే అని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.