- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడు ఓటుకు నోటు.. ఇప్పుడు సీటుకు నోటు: రేవంత్‌పై హరీష్ రావు సెటైర్
X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయాయని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం.. కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేశారు. రేపు సిద్ధిపేటలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నామని.. లక్ష మందితో ఈ సభను నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభకు కేసీఆర్ హాజరవుతారని పేర్కొన్నారు. ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అప్పుడు ఓటుకు నోటు కేసుతో ఫేమస్ అయ్యారు.. ఇప్పుడు సీటుకు నోటుతో ఫేమస్ అవుతున్నారని సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డి డబ్బులకు కాంగ్రెస్ పార్టీ టికెట్‌లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేతలే అంటున్నారని అన్నారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాది మేకపోతూ గాంభీర్యమని ఎద్దేవా చేశారు.
Advertisement
Next Story