- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Owaisi: రేవంత్‌ను చూస్తే గర్వంగా ఉందన్న ఒవైసీ.. చిరునవ్వు చిందించిన సీఎం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. శనివారం బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకానొక దశలో మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలు సైతం చేసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ఆయన ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడు అని అన్నారు.
ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో సభాధ్యక్షుడి స్థానంలో రేవంత్ రెడ్డిని చూడడం చాలా సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు. తన స్నేహితుడి ఎదుగుదలను చూసి గర్వపడుతున్నానని అన్నారు. అక్బరుద్దీన్ మాటలను విన్న సీఎం రేవంత్ చిరునవ్వులు చిందించారు. అనంతరం విద్యారంగం నుంచి మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి పెట్టాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రియింబర్స్‌మెంట్లు, స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో అక్షరాస్యత బాగా తగ్గిందని చెప్పారు.