- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలో.. బీఆరెస్ విలీనం అనేది శుద్ధ అబద్ధం! బీజేపీ ఎంపీ ఈటల
దిశ, వెబ్ డెస్క్: బీజేపీలో బీఆరెస్ విలీనం అనేది శుద్ధ అబద్దమని అన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇప్పటివరకు దీనికి సంబంధించిన చర్చ కూడా బీజేపీలో జరగలేదని అన్నారు. ఈ విధంగా బీఆరెస్ నేతలు అనుకుంటున్నారేమో.? అవే మాటలను యధావిధిగా కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తిరిగి చెప్తున్నారని ఈటల అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీని మమా అనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ అని చెప్పింది. కానీ పూర్తి స్థాయిలో ఇప్పటివరకు చేయలేదని, కాబట్టి సీఎం ప్రజల్ని, రైతుల్ని మోసం చేసినట్లేనని ఈటల వ్యాఖ్యానించారు.హైడ్రా పేరుతో అడ్డగోలుగా కూల్చివేతలు చేస్తే తాము ఊరుకునేది లేదని, ఇలా ఇష్టారీతిన కూలగొట్టే అధికారం వారికి ఎవరిచ్చారని మండిపడ్డారు. FTL పరిధిలో ఉన్నటువంటి భూములు ప్రభుత్వానివి కాదనీ.. అవి రైతుల భూములని అన్నారు. అయితే బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని కొందరు మాట్లాడుతున్నారని, కానీ బీజీపీ గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతుందే తప్ప పడిపోలేదని వెల్లడించారు.