Sudha Reddy: మీడియా ముందుకు రావడంపై MEIL డైరెక్టర్ సుధా రెడ్డి హాట్ కామెంట్స్

by Ramesh N |
Sudha Reddy: మీడియా ముందుకు రావడంపై MEIL డైరెక్టర్ సుధా రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర బడ్జెట్ (Union Budget 2025) 2025-26 బావుందని ప్రముఖ వ్యాపారవేత్త మేఘా ఇంజనీరింగ్ సంస్థల (ఎంఈఐఎల్) డైరెక్టర్ సుధారెడ్డి (Meil Director Sudha Reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. హెల్త్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్, రైతులకు చేయుతనిచ్చేలా ఈ బడ్జెట్ ఉందని తెలిపారు. మహిళా సాధికారతకు ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేశారని అన్నారు. జల్ జీవన్ ప్రాజెక్ట్ కాలపరిమితి పెంచడం ఆనందంగా ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ అంత పీపుల్ ఫ్రెండ్లీ బడ్జెట్ అని కొనియాడారు.

ప్రతి రంగంలో సమాన కేటాయింపులు జరిగాయని, ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. దేశ అభివృద్ధి కి ఈ బడ్జెట్ తోడ్పడుతుందన్నారు. దీనివల్ల ‘ఎంఈఐఎల్’ చేపట్టిన ప్రాజెక్టులకు ఊతం ఇచ్చేలా ఉన్నాయని చెప్పారు. ఇన్కమ్ టాక్స్ పరిమితి 12 లక్షలకి పెంచడం శుభపరిణామమని అన్నారు. తాను మీడియా ముందుకు రావడంపై పెద్దగా కారణాలు లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. వెల్ఫేర్ సొసైటీ నడుస్తుందని, ప్రజా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు వెల్లడించారు. రాజకీయం కోసం కాదు.. పేద వారికి భరోసా సహాయం అందించాలని చూస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed