కర్మన్‌ఘాట్‌కు హనుమాన్ టెంపుల్‌కు మెగా HERO

by Gantepaka Srikanth |
కర్మన్‌ఘాట్‌కు హనుమాన్ టెంపుల్‌కు మెగా HERO
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఎల్బీనగర్ సమీపంలోని కర్మన్‌ఘాట్ హనుమాన్‌ టెంపుల్‌(Karmanghat Hanuman Temple)ను మెగా హీరో(Mega HERO) సాయిదుర్గ తేజ్(Sai Durga Tej) సందర్శించారు. మంగళవారం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు సాయిదుర్గ తేజ్‌కు ఆలయ పూజారులు స్వాగతం పలికారు. శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, ప్రస్తుతం రోహిత్‌ కేపీ దర్శకత్వంలో ఓ పీరియాడ్‌ యాక్షన్‌ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో సాయిదుర్గతేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. కే.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. తొలిసారి సాయిదుర్గ తేజ్‌ పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను తీసుకొచ్చారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది. ఇందులో నటుడు శ్రీకాంత్‌ క్రేజీ రోల్‌‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బి.అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు.




Advertisement
Next Story