‘మినిస్టర్​సాబ్.. అసలు మెదక్​సంగతేంటి?’

by Gantepaka Srikanth |
‘మినిస్టర్​సాబ్.. అసలు మెదక్​సంగతేంటి?’
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ మెదక్​పార్లమెంటరీ సెగ్మెంట్‌పై స్పెషల్‌గా ఫోకస్​పెట్టారు. ఇప్పటికే ఈ లోకసభ నియోజకవర్గానికి సంబంధించి ఫీడ్​బ్యాక్‌ను నటరాజన్ తెప్పించుకున్నారు. మంగళవారం గాంధీ భవన్‌లో మెదక్​పార్లమెంట్​సెగ్మెంట్‌లోని నేతలతో ఆమె రివ్యూ చేశారు. ఆమె లోకసభ పరిధి నియోజకవర్గాల నేతల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. నేతలంతా పార్టీ వ్యవహారాలు, చేపట్టాల్సిన అంశాలపై తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ విషయంలో మీనాక్షి సానూకులంగా స్పందించారు. అన్ని విషయాలను నోట్​చేసుకున్నారు. కాగా, మీటింగ్ ముగిశాక ఏఐసీసీ రూమ్‌లో మీనాక్షి నటరాజన్​మంత్రి దామోదర రాజనర్సింహాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘‘మినిస్టర్​సాబ్.. అసలు మెదక్​ సంగతేంటి? అని” మీనాక్షి నటరాజన్​మంత్రిని ప్రశ్నించినట్లు తెలిసింది.

అసెంబ్లీ ఎన్నికలు నుంచి మొదలు పార్లమెంట్​వరకు అక్కడ సీట్ల కేటాయింపు వ్యవహారం గురించి ఆరా తీసినట్లు సమాచారం. ప్రధానంగా మెదక్​పార్లమెంట్​లోకసభ నియోజకవర్గానికి కాంగ్రెస్​పార్టీ నుంచి అభ్యర్థులు ఉన్నప్పటికీ, ఇతరులకు టికెట్ ఇవ్వడం వెనుక మతలబ్ ఏంటి అని అడిగినట్లు తెలిసింది. కేవలం ఇదీ ఇక్కడి వరకే జరిగిందా? అంతటా ఇదే కొనసాగిందా? అని కూడా ఆమె మంత్రిని అడిగినట్టు సమచారం. ఇకపోతే పటాన్​చెరు లొల్లి ఏమిటని ప్రశ్నించిందట.. వీటన్నింటికి త్వరలోనే చెక్​పెట్టాలని ఆమె ఈ సందర్భంగా మంత్రితో వ్యాఖ్యనించినట్లు తెలిసింది. ఏదైమైనా మీనాక్షి నటరాజన్​అసెంబ్లీ, పార్లమెంట్​ఎన్నికల ఓటమికి గల కారణాలు, అలాగే, రానున్న రోజుల్లో పార్టీ బలోపేతంతోపాటు గెలుపునకు ఎలా ముందుకెళ్లాలన్న దానిపై లోతుగానే ఫీడ్​బ్యాక్​తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Next Story